ముస్తాబైన బాసర అమ్మవారి ఆలయం

82பார்த்தது
దసరా ఉత్సవాలకు బాసర అమ్మవారి ఆలయం విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. గురువారం నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. తొమ్మిది రోజుల్లో రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం ఉంటుందని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி