లోకేశ్వరం మండలంలోని పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వి రమణారావు శుక్రవారం ప్రారంభించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయుల వద్ద పీఆర్టీయు సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బి. వి రమణారావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిఆర్టియు ఎల్లప్పుడు ముందుంటుందని అతిపెద్ద సంఘంగా మన పీఆర్టీయు నిలిచిందని తెలిపారు.