బాల్యవివాహాలు చట్టరీత్య నేరం అని విజన్ సంస్థ కమ్యూనిటీ మొబలైజర్ అనురాధ పేర్కొన్నారు. గురువారం కుంటాల మండలంలోని ఓలా ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే 1098 హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం రాహుల్, కోఆప్షన్ మాజీ సభ్యులు హైమద్ పాషా తదితరులు పాల్గొన్నారు.