ఉగాది పండుగ సందర్భంగా కుబీర్ మండల కేంద్రంలో ఆదివారం అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ విఠలేశ్వర కమిటీ అధ్యక్షుడు బొట్టే పెంటాజి తెలిపారు. పోటీలు నిర్వహించే మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు శనివారం తెలిపారు. ఆసక్తిగల మల్లయోధులు పోటీల్లో పాల్గొనాలని కోరారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తారని తెలిపారు. ప్రజలు భారీగా తరలివచ్చి ఈ కుస్తీ పోటీలను తిలకించాలని కోరారు.