తానూర్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ముఖ్య కార్యనిర్వానాధికారి జిల్లా పరిషత్ (సీఈఓ) ఐ. గోవింద్ సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ నుంచి వచ్చిన పనులు పై సమీక్షించారు. చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఎంపీవో ఎండి. నసీరోద్దీన్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్ అనంత విశ్వేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.