భైంసా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో నాయకులు నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కోశాధికారి మహేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమించుకొని వేలం వేసేందుకు సిద్ధమైందన్నారు. న్యాయబద్ధంగా భూముల రక్షణ కోసం పోరాటం చేస్తే విద్యార్థులను ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందన్నారు.