నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 356.30 అడుగులు ఉందని పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో ప్రాజెక్టులో ఎలాంటి నీరు ప్రవాహం లేదని తెలిపారు. కెనాల్కు 80, మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు వెల్లడించారు.