బాసర ఆర్జీయూకేటీని అన్ని రంగాల్లో ముందు ఉంచుతామని వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. శుక్రవారం డీన్స్, అకాడమిక్స్, స్టూడెంట్ వెల్ఫేర్ అధికారులతో సమావేశం అయ్యారు. విశ్వ విద్యాలయంలో అందిస్తున్న కోర్సుల వివరాలు, అకాడమిక్ క్యాలెండర్, వసతి గృహాల వివరాలు, విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న సేవలు తదితర అంశాలను అధికారులు వివరించారు. అనంతరం భోజనశాలలను పర్యవేక్షించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.