అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని కడెం ఎస్ఆర్ఓ గీతారాణి అన్నారు. వన్యప్రాణి సప్త వారోత్సవాలలో భాగంగ గురువారం కడెం మండల కేంద్రంలో మండల అటవీ అధికారులు, సిబ్బంది సేవ్ ద టైగర్, సేవ్ ద నేషన్, అడవుల రక్షణ అందరి బాధ్యత అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అడవులు రక్షిస్తేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతన్నారు.