నర్వ మండలంలోని రైతు వేదికలో ఆయా గ్రామాలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులైనటువంటి వారికి బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే వంట గ్యాస్ అందిస్తున్నామని తెలియజేశారు.