కృష్ణ: శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం

76பார்த்தது
కర్ణాటక, తెలంగాణ నుంచి పాదయాత్రగా వెళుతున్న భక్తులకు కృష్ణ మండలంలోని హిందూపూర్ వెంకట రమణ గుడి వద్ద హిందూపూర్ శివ స్వాములు, గ్రామప్రజల ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవకృపతో భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. భక్తులకు అన్నదానం చేయడం ఆత్మసంతృప్తిని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி