నల్లగొండ స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏచూరి సీతారాం మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన మరణం నన్ను ఎంతగానో కలిసి వేసిందని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.