నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా ప్రభాత వేళలో మొదటగా పరమశివుడిని ఆరాధన చేస్తూ ఆవుపాలు, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం విభూదితో అలంకరించారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.