మిషన్ భగీరథ కాంటాక్ట్ కార్మికుల 8 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, లేనియెడల సెప్టెంబర్ 26 నుండి నిరవధిక సమ్మె చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు. తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం పానగల్లులోని మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లుకు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది.