వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని వల్లభరావు చెరువును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ పరిశీలించారు. విగ్రహాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతాలలో అవసరమైన అన్ని ప్రాంతాలలో సిసి కెమెరాలు, నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉండాలన్నారు.