స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు బుధవారం నల్గొండ పట్టణ కేంద్రంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల రక్షణ దృష్ట్యా పోలీసు జాగిలాలతో పట్టణ కేంద్రంలో 1 టౌన్, టౌన్ పోలీసులు సమన్వయంతో వాహన తనిఖీలు, హోటల్స్, లాడ్జిలు, బస్ స్టాండ్, తదితర రద్ది ప్రదేశాలు తనిఖీ చేయడం జరిగింది.