మిల్లర్లు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని క్వింటాకు రూ. 2400 తగ్గకుండా కొనుగోలు చేయాలని డిఎస్ఓ వెంకటేశ్వర్ రావు ఆదేశించారు. శుక్రవారం వేములపల్లి మండలం శెట్టిపాలెంలోని ఒక ఇండస్ట్రీస్ లో ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, నాన్ ఆయకట్టు ప్రాంతాల రైతులు మిల్లుల వద్దకు తెచ్చే ధాన్యాన్ని వర్షాభావ పరిస్థితులను అడ్డుగా పెట్టుకొని ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.