భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 20వ వార్డు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభ-ప్రజానాట్యమండలి శౌర్య యాత్ర బృందంచే కళాప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దొరలు, జాగిర్దారులు, జమీందారులు గ్రామీణ ప్రజల మాన ప్రాణాలను దోచుకునే వారని అన్నారు.