నల్గొండలో కూడా హైడ్రా తరహా వ్యవస్థ తేవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలోని తన కాపు కార్యాలయంలో మాట్లాడుతూ కబ్జాలకు గురైన చెరువులను, భూములను హైడ్రా పేరుతో సీఎం రేవంత్ కాపాడుతున్నారని, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. నల్గొండలో కూడా అలాంటి వ్యవస్థ తేవాలని ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు.