ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలతో పాటు, కాస్మోటిక్ చార్జీలను పెంచిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన 40 శాతం డైట్ చార్జీలు, కామన్ మెనూ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన నకిరేకల్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో పెంచిన డైట్ చార్జీలు, కామన్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.