చిట్యాల మండల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నీ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. అన్నీ శాఖలకు సంబంధించి మొత్తం ఒకే ఒక దరఖాస్తు వచ్చినది. అది రెవెన్యూ శాఖకు సంబంధించిది వచ్చిన దరఖాస్తును వెంటనే ఆన్లైన్లో నమోదు చేయడం జరిగినదని ఎంపీడీఓ ఎస్. పి. జయలక్ష్మి తెలియజేశారు.