నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్బంగా శుక్రవారం 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతార రూపంలో దర్శనమిచ్చారు. ఈ అమ్మవారిని శాసనసభ సభ్యులు వేముల వీరేశం
దర్శించుకుని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుబ్బాక నరసింహ రెడ్డి, దుబ్బాక అమరేందర్ రెడ్డి, కమ్మంపాటి మహేష్, పలువురు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.