హాలియా పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వసంత్‌కుమార్(43) అనారోగ్య కారణంగా మంగళవారం మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు బుధవారం హాలియా పట్టణంలో నిర్వహించారు. వసంత్‌కుమార్ మంగళవారం ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని హాలియా పట్టణంలోని స్వగృహానికి తీసుకువచ్చారు.