నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సోమవారం వరద ప్రవాహం పెరగడంతో 20 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి 2, 01, 082 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 2, 05, 000 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2, 46, 500 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయి.