నాగార్జున సాగర్: సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతుండడంతో బుధవారం రెండు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 65, 759 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 60, 233 క్యూసెక్కులు ఉంది. ఇక జలాశయంలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి.