గుర్రంపోడు: హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన గుర్రంపోడు ఎస్సై నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజిపి వి. సత్యనారాయణ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మండల పరిధిలోని ముల్కలపల్లి లో రజిత అనే వివాహిత హత్య కేసును మొదట ఆత్మహత్యగా నమోదు చేయడం, ఇద్దరు నిందితులను తప్పించేందుకు లంచం తీసుకున్నట్లు పోలీసుల ఉన్నతస్థాయి విచారణలో బయటపడింది. దీంతో ఎస్ఐపై వేటుపడింది. కాగా ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.