నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో గురువారం ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. కాగా ఈ సీజన్ లో 5వ సారి నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి.