'మాఫీ' కావాలంటే.. సెల్ఫీ దిగాల్సిందే..!
అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రేషన్‌కార్డు లేని కారణంగా రుణమాఫీ కాని రైతుల కుటుంబాల నిర్ధారణ (ఫ్యామిలీ గ్రూపింగ్) ప్రక్రియ కొనసాగుతోంది. మండల వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ఆయా రైతుల కుటుంబాలను నిర్ధారణ చేస్తున్నారు. ఇందుకోసం సదరు రైతు కుటుంబ సభ్యులంతా కలిసి ఓ సెల్ఫీ ఫోటో (స్వీయచిత్రం) దిగాల్సి ఉంటుంది. ఈ ఫోటోను అధికారులు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు.