హైదరాబాద్ లోని గాంధీభవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ కు ఆదివారం శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే పదవులు దక్కుతాయని చెప్పడానికి మహేష్ కుమార్ గౌడ్ నియామకమే చక్కటి ఉదాహరణ అంటూ కొనియాడారు.