డిండి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, రైతు సంఘం జిల్లా నాయకులు మల్గ యాదయ్య లు అన్నారు. శనివారం చండూరు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు రెండోవ రోజు ముగిసింది. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ నిర్మలకు కు మెమోరండం ఇచ్చారు.