నలగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 'భారత రాజ్యాంగం' గ్రంధాన్ని ప్రతి పౌరునికి ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ గట్టుప్పల్ మండల ఎం ఆర్ ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 'భారత రాజ్యాంగం' ద్వార దేశంలోని 90% బి సి, ఎస్ సి, ఎస్ టి లు అయిన ప్రతి పౌరునికి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో మరియు భారత రాజ్యాంగ పుస్తకాలను ప్రతి ఇంటింటికి, ప్రతి పౌరుడికి ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. 33 జిల్లాల కలెక్టర్లకు 02/05/2033 న విజ్ఞాపన పత్రాలను అందజేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించని యెడల ధర్నాలు నిర్వహించి, రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్రనాయకులు గిరి మహారాజ్, సజీవ మహారాజ్, గట్టుప్పల్ మండల ప్రచార కమిటీ నాయకులు లింగయన్ , మారయ్య, అజయ్, సురేష్, క్రిష్ణ, మురళి, రాజు, గణేష్, బీసీ నాయకులు పాల్గొన్నారు.