స్పోర్ట్స్ అసోసియేషన్ నెహ్రు యువకేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. గర్ల్స్ జూనియర్ కాలేజీ, కొత్త బస్టాండ్ ఆవరణలో ఉన్న ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లను ఏరి వేశారు. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే జీవరాశుల మనుగడ కనుమరుగవుతుందని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్, ప్రవీణ్ సింగ్, శ్రీధర్, కృష్ణ కిషోర్, ఆంజనేయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.