కేవలం తెల్లవాడు కానందువల్ల రైలులో నుంచి మొదటి తరగతిలోంచి బ్రిటిష్ వారు నెట్టివేశారు. అలాగే హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకి సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నారు.1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ఆగలేదుగానీ, గాంధీజీ బాగా జనాదరణ సంపాదించారు.