శ్రీశైలం సొరంగ మార్గం పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించి, డిండి ఎత్తిపోతల లిఫ్టు పథకం డిపిఆర్ ను ఆమోదించాలని కోరుతూ శుక్రవారం ఎస్ఎల్బిసి టన్నెల్ పరిశీలనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ లకు సిపిఎం బృందం వినతి పత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, వీరారెడ్డి, అయిలయ్య, మల్లేశం తదితర నేతలు పాల్గొన్నారు.