రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నివారించడం కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు నిమ్మల పద్మ, సిఐటియు నాయకులు వెంకటయ్యలు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం దేవరకొండలో జరిగిన ఐద్వా మండల మహాసభలో వారు పాల్గొని మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటిన, నేటికీ మహిళలకు రక్షణ కరువైందన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, యాదగిరి, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.