నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, డిండి మండలం వావిల్ కోల్ గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ నేత, మాజీ ఉపసర్పంచ్ చంద్రారెడ్డి బుధవారం మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ సందర్శించి నివాళి అర్పించారు. చంద్రారెడ్డి మృతి బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో టివిఎన్ రెడ్డి, ఎం. శ్రీనివాసు రావు, పి. జంగారెడ్డి, తిరుపతయ్య ఉన్నారు.