ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేవరకొండ పార్టీ కార్యాలయంలో పల్లా పర్వత రెడ్డి భవన్ లో జరిగిన నియోజకవర్గ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ఆవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని అన్నారు.