ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయగా ఆ కమిటీ మాత్రం కేవలం ఎస్సీ వర్గీకరణ పైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని నాగర్ కర్నూల్ జిల్లా ఆదివాసి, ఎరుకల సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్ తెలిపారు. ఎస్టీలో ఎరుకల కులస్తులు తెలంగాణలో రాజకీయ, ఉద్యోగ, ఉపాధి, ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున ప్రభుత్వ పథకాలు అందడం లేదు కాబట్టి ఎస్టీ, ఉపకులాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని బుధవారం డిమాండ్ చేశారు.