టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. తిరుపతిలో మంచి వాతావరణం ఉన్నట్లు తెలిపారు. సినీ ఇండస్ట్రీకి, అందరికీ మంచి జరగాలని కోరుకున్నానని అన్నారు. కల్కి-2 సినిమా అప్డేట్ గురించి అడగ్గా దానికి చాలా టైమ్ పడుతుందని అన్నారు.