మోహన్‌లాల్‌ ‘తుడరుమ్‌’ చిత్రం విడుదల తేదీ ఖరారు

51பார்த்தது
మోహన్‌లాల్‌ ‘తుడరుమ్‌’ చిత్రం విడుదల తేదీ ఖరారు
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ‘ఎల్-2 ఎంపురాన్’ మూవీ ఇటీవల విడుదలై భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తదుపరి చిత్రం ‘తుడరుమ్’ కూడా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీ జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా ఆలస్యమైంది. ఈ క్రమంలో మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఇందులో మోహన్ లాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించడం విశేషం.

தொடர்புடைய செய்தி