స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చిత్రపరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) పై స్పందించింది. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని దాని వల్ల చాలా సినిమా అవకాశాలు పోగొట్టుకున్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. "ఒక స్టార్ కిడ్‌కు సులభంగా ఛాన్సులు వచ్చినట్లు కొత్తవారికి రావు. అదంతా వారి తల్లిదండ్రుల కష్టం” అని ఆమె అన్నారు. అవకాశాలు కోల్పోయానే అనే బాధ తనలో ఉండదని, ఆ సినిమాలు తన కోసం ఉద్దేశించినవి కాకపోవచ్చని ముందుకు వెళ్తాను అని రకుల్ చెప్పారు.