HYD మెట్రో రైళ్లలో రద్దీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. నాగ్‌పుర్, పుణె నుంచి లీజు పద్ధతిలో కోచ్‌లను తీసుకురావాలనే ప్రయత్నాలూ ఫలించలేదు. దీంతో కొత్త కోచ్‌లు కొనేందుకు ఎల్ అండ్ టీ HYD మెట్రోరైలు సంస్థ దేశీయంగా మెట్రో కోచ్‌లు తయారుచేసే మూడు సంస్థలతో చర్చిస్తోంది. అయితే వాటిని తయారు చేసి సరఫరా చేసేందుకు 18 నుంచి 24 నెలలు పడుతుంది. అదీ.. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తేనే. అప్పటి వరకు ఉన్న కోచ్‌లతో సరద్దుకోవాలి.