మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎల్లారెడ్డి గూడ తండలో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవ నేని రఘునందన్ రావుకి ఈ సమస్యను తెలియజేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ తో ఎల్లారెడ్డి గూడ తాండ ప్రజలు తెలిపారు. సమస్య పరిష్కారమయ్యేలా ఎంపీ దృష్టికి తీసుకెళతామని ఆయన తెలిపారు.