మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ పోస్ట్ మెన్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని శుక్రవారం గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్థులు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన, ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పోస్టు మెన్ మాత్రం సమయానికి రాక వచ్చిన డబ్బులు సరిగ్గా ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారన్నారు. వెంటనే పోస్ట్ మెన్ ను బదిలీ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.