రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ చేరికలు

586பார்த்தது
రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పర నర్సింగ్, డివిజన్ సెక్రెటరీ అశోక్ ఆధ్వర్యంలో ఘనపూర్ సెక్షన్ పరిధిలో పనిచేస్తున్న 17 మంది ఆర్టిజన్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతన ఆర్టిజన్ లకు కండువా కప్పి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నర్సింగ్ అశోక్ మాట్లాడుతూ.. ఆర్టిజన్ లకు ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిష్కరిస్తామని, కార్మికుల సమస్యల కోసం పోరాటం చేసే సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం మొదటి నుండి కార్మికుల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నూతనంగా సభ్యత్వం తీసుకున్న వారికి పేరుపేరునా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నుండి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సింగ్, అశోక్, రాజేశ్వర్, బండమీది రత్నం, భవాని ప్రసాద్, అజిత్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி