తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంలో భారీ చేరికలు

1264பார்த்தது
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంలో భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఏడుపాయల దుర్గాభవాని సన్నిధిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నాయకులు ఆధ్వర్యంలో 20 మంది ఆర్టిజన్ కార్మికులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో H82 నుండి దాదాపు 20 మంది వరకు ఆర్టిసన్ మరియు జెఎల్ఎం కార్మికులు టిఆర్వికేఎస్ యూనియన్ లో చేరడం జరిగింది. ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిషినల్ జనరల్ సెక్రెటరీ నిరంజన్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డప్పు వెంకటేశం, డిస్కమ్ అధ్యక్షులు యూసఫ్, కార్యదర్శి కరెంట్ రావు, డిస్కమ్ అసిస్టెంట్ సెక్రెటరీ బాలయ్య మెదక్ జిల్లా అధ్యక్షులు నర్సింగ్, డిస్కమ్ కోశాధికారి మరియు మెదక్ జిల్లా కార్యదర్శి ఓరం సత్యనారాయణ, రాజేశ్వేర్ రావు అశోక్, నాగరాజు రాములు, వెంకటేశం, తిరుపతి, ప్రతాప్ రెడ్డి, బిక్షపతి, ప్రవీణ్ గౌడ్ , గంగారాం, రమేష్ గౌడ్, సుధాకర్ , గోపాల్, నరేష్, మహేష్, మోషే, ఖాదర్, గోపాల్, యాదగిరి, ఎశు, నాగేశ్వర్ రావు, ప్రదీప్ గౌడ్, మోహన్, సత్యం, శ్రావణ్ గౌడ్, పెంటయ్య, బాలయ్య, వెంకటేశం, మల్లేష్, రాములు, తదతరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி