ఏడుపాయల జాతరలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

3978பார்த்தது
ఏడుపాయల జాతరలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
ఏడుపాయల జాతరలో విద్యుత్ కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీరింగ్ కృష్ణారావు బుధవారం విద్యుత్ కార్యాలయంలో మాట్లాడుతూ తెలిపారు. ఏడుపాయల జాతరకు సంబంధించి 100 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్లు 13, 160 కేవిఏ డీటిఆర్ లు 2 ప్రారంభించామని తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని వసతి గృహాల, షాప్ ల కు సంబంధించి సరైన పద్ధతిలో విద్యుత్ ను వాడుకోవాలని విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி