కార్మికుల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించిన విద్యుత్ కార్మికులు

348பார்த்தது
కార్మికుల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించిన విద్యుత్ కార్మికులు
కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు మెదక్ డివిజన్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి భాస్కర్ మాట్లాడుతూ చికాగో 1886 పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా కార్మికులు తిరుగుబాటు చేయడం జరిగింది. 16 గంటల పని భారాన్ని ఎనిమిది గంటలకు కుదించాలని పెద్ద ఎత్తున కార్మికులు చికాగోలోని తిరుగుబాటు చేయడంతో ఒక్కసారిగా కార్మికులపై కాల్పులు జరపడం జరిగింది. ఆ కాలుపుల్లో వేలాదిమంది కార్మికులు చనిపోవడం జరిగింది. చనిపోయిన ఆ రక్తపు మడతలతో తడిసిన చుక్కలే నేడు ఎర్రజెండా గా మారి. ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నర్సింగ్. డివిజన్ అధ్యక్షులు నాగరాజు. కార్యదర్శి అశోక్. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్. డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి. రత్నం. రాములు. కనకయ్య. ఉస్మాన్. తిరుపతి. మల్లేశం. తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி