రాష్ట్ర జాక్ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ 15 వ తేది రోజు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 4124 గల సెర్ప్(ఎస్ఈఆర్పి) ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను పెంపుదల చేసి, స్థిరీకరించి చెల్లింపు చేస్తున్నామని ప్రకటించిన సందర్భంగా సోమవారం మెదక్ జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డిఆర్డిఓ మరియు అదనపు డిఆర్డిఓకి పుష్ప గుచ్ఛం ఇచ్చి మిఠాయి ఇస్తూ సంతోషంలో సెర్ప్ ఉద్యోగులు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెర్ప్ జాక్ నాయకులు శ్రీరాం నాగరాజు, లక్ష్మీ నర్సమ్మ, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, డీపీఎంలు జాన్ కెన్నేడి, మోహన్, సురేష్, ఏపీఎం సాయిలు, ఇందిర సిసిలు, వెంకటేష్, శంకర్ ఎం.ఎస్ సిసిలు కిషన్, సరిత మరియు వివిధ స్థాయిల సెర్ప్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.