మావోయిస్టులు మరో అమాయకుడిని చంపేశారు. ఇన్‌ఫార్మర్ అనే నెపంతో ఛత్తీశ్‌గఢ్‌లోని బాంరగడ్‌కు చెందిన పూసు పుంగంటి (52) అనే వ్యక్తిని మావోయిస్టులు గొంతు కోసి హత్య చేశారు. ఓ వివాహ వేడుకకు వెళ్లగా అతడిని కిడ్నాప్ చేసి ఈ ఘాతాకానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.